CM Revanth Reddy | తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకాకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.
CM Revanth Reddy | తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకాకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress) ఒకవైపు నాయకుల గ్రూపుల పంచాయితీలు, మరోవైపు 22A సమస్యలు, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇలా రాష్ట్రంలో సమస్యలు ఒక్కొక్కటిగా ముదురుతున్న సమయంలో పరిపాలనను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా(America) పర్యటనకు వెళ్లడమేంటని ఏఐసీసీ(AICC) ప్రశ్నించినట్లు సమాచారం.
పర్యటనలో ఉంటే పదవి పోతుందనే భయంతోనే రేవంత్ తన US పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో దిక్కుతోచని రేవంత్ టీమ్, పర్యటన రద్దుకు అసలు కారణాలను పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది అంటూ US పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రచారంలోకి తీసుకువచ్చింది. పర్యటన రద్దుకు అసలు కారణం పదవి గండమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News

Comments
Nothing yet. Say the first thing.
Sign in to join the conversation.