RSS Amplifier

News source

Prathi Paksham

prathipaksham.inSource feed ↗92 articles

Live Last read · last published · next check

Written by

Latest articles

బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి భరోసా – పదివేల ఆర్థిక సాయం అందజేత.

ప్రతి పక్షం చండూరు ఆగస్టు 29: చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కురుపాటి శ్రీను గారి మాతృమూర్తి కురుపాటి ఎమ్మెల్యే గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను ఈ రోజు గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉజ్జిని ఉషా అనిల్ రావు , బీఆర్ఎస్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో కురుపాటి బిక్షమయ్య…

చండూరులో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

*7వ వార్డులో డ్రైనేజీ, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన . *7వ వార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ప్రతి పక్షం చండూరు ఆగస్టు 29: చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 7వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు.మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీకి కేటాయించిన రూ. 15 కోట్ల అభివృద్ధి నిధుల నుండి…

భారీగా తగ్గిన టమాటా ధరలు.. కేజీ రూ.10.. రైతులకు కన్నీళ్లే!

ప్రతిపక్షం, ఆగస్టు 29: టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమాటా ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో 15 కిలోల టమాటా క్రేట్ కేవలం రూ.150కే పలుకుతుండటంతో.. కిలో…

రాష్ట్ర ద్రోహి సజ్జల: విజయసాయి రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర ద్రోహిగా అభివర్ణించారు. తనను నమ్మక ద్రోహిగా చిత్రీకరిస్తూ సజ్జల వర్గం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను నిజంగా నమ్మక ద్రోహినైతే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో రాజీపడి, సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినని వ్యాఖ్యానించారు.…

తెలంగాణలో గోల్ఫ్‌ కిక్‌.. గోల్కొండలో భారీ అంతర్జాతీయ టోర్నీ

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో గోల్ఫ్‌ క్రీడకు మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సమీపంలోని జవహర్‌నగర్‌లో భారీ గోల్ఫ్‌ కోర్సును ఏర్పాటు చేయడంతో…

దళితులకు అన్నిచోట్లా అవమానాలే.. ఖర్గే పర్యటన తర్వాత ‘ప్యూరిఫికేషన్‌’పై రాహుల్‌ ఆగ్రహం

ప్రతిపక్షం, ఆగస్టు 29: దేశంలో దళితులు అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో అవమానాలను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దళితులు తమ హక్కులు, సమస్యలపై గొంతెత్తుతున్న కొద్దీ వారిపై దాడులు మరింత తీవ్రమవుతున్నాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం జరిగినట్లు చెబుతున్న ‘ప్యూరిఫికేషన్‌’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌…

వైసీపీలో సజ్జల నంబర్‌1.. జగన్ నంబర్‌2: విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అంతర్గత వ్యవహారాలపై మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీలో ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధిపత్యం కొనసాగుతోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే సజ్జలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీలో సజ్జల నంబర్‌1గా, జగన్ నంబర్‌2గా మారిపోయారని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు…

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం.. చిన్న నీటిపారుదలపై సీఎం రేవంత్‌కు రైతు కమిషన్ కీలక నివేదిక

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, చెరువులను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసి చిన్న నీటిపారుదల వనరులను పునరుద్ధరించాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని…

వరదల నుంచి త్రుటిలో తప్పించుకున్నాం.. టీ కోసం ఆగడమే ప్రాణాలు కాపాడింది

ప్రతిపక్షం, ఆగస్టు 29: మానససరోవర్‌ యాత్రకు వెళ్తుండగా భారీ వరదల నుంచి త్రుటిలో తప్పించుకున్నామని ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి తల్లి దాసరి శ్రీలక్ష్మిరెడ్డి తెలిపారు. కేవలం టీ తాగేందుకు పది నిమిషాలు ఆగడం వల్లే తమ ప్రాణాలు దక్కాయని చెప్పారు. “టీ తాగేందుకు పది నిమిషాలు ఆగాం. ఆ తర్వాత క్షణాల్లోనే భారీ వరద వచ్చింది. మా కంటే ముందు వెళ్లిన వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ విషాదకర దృశ్యాలను చూసి…

ఈ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణ వెదర్‌మ్యాన్‌

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో నేడు వర్షాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ బాలాజీ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్‌, భద్రాద్రి…

వరదల వేళ అండగా నిలిచిన భారత్‌.. నేపాల్ అధ్యక్షుడి ధన్యవాదాలు

ప్రతిపక్షం, ఆగస్టు 29: ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌కు భారత్‌ అందించిన సహాయానికి ఆ దేశ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా నిలిచినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం అందించిన మద్దతు, సంఘీభావం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఆగస్టు 26న చోటుచేసుకున్న…

క్యాబినెట్‌లో మార్పులు అవసరం.. గీత దాటిన వారిపై చర్యలు తీసుకోవాలి: గుత్తా సుఖేందర్‌ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణ రాజకీయాల్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలో, మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పాలనలో, పార్టీలో అవసరమైన మార్పులు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడం,…

మాట్లాడితే అమృతం.. పలికితే పాట.. మన తెలుగే అద్భుతం.. తెలుగు భాష గొప్పతనాన్ని చాటే ప్రత్యేక రోజు

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలుగు.. మన భావాలకు అక్షర రూపం ఇచ్చిన భాష. మన సంస్కృతికి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే మాతృభాష. మాట్లాడితే తీయగా.. పలికితే మధురంగా.. పాడితే పాటగా ఒలికే తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి మాతృభాష గొప్పతనాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. తెలుగు భాషాభివృద్ధికి, సరళీకరణకు విశేష కృషి…

ఎల్బీనగర్‌లో నేడు దివ్యాంగుల సమరభేరి.. హాజరుకానున్న హరీశ్‌రావు

ప్రతిపక్షం, ఆగస్టు 29: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో నేడు దివ్యాంగుల సమరభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కులు, సంక్షేమం, ఉపాధి, ఆర్థిక భద్రత వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా…

మోదీ జీ చెప్పినట్లే ‘డబుల్’ చేశారు.. కాంగ్రెస్‌ సెటైర్

ప్రతిపక్షం, ఆగస్టు 29: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రజల ఆదాయం రెట్టింపు కాలేదని, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భారీగా పెరిగాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టర్‌ను పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. ‘మోదీ జీ చెప్పినట్లే డబుల్ చేశారు.. ప్రజల ఆదాయాన్ని కాదు,…

ప్యాకేజ్డ్‌ జంక్‌ ఫుడ్‌పై డేంజర్‌ లేబుల్స్‌.. నిర్ణయంపై ప్రశంసలు!

ప్రతిపక్షం, ఆగస్టు 29: ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఉత్పత్తులపై ఎరుపు రంగులో స్పష్టమైన డేంజర్‌ లేబుల్స్‌ ముద్రించాలన్న భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి పదార్థాలు ఉండే ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు వినియోగదారులు అప్రమత్తంగా ఉండేందుకు ఇలాంటి హెచ్చరికలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సిగరెట్లు, మద్యం వంటి ఆరోగ్యానికి…

సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ తెలుగు సీజన్-10.. హౌస్‌లోకి వెళ్లేది వీరేనా?

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 సందడి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6న పదో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో ఈ సీజన్‌పై…

మెదక్ లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్కమ్ బోర్డు చౌరస్తా నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు పురుషులకు ఐదు కిలోమీటర్ల రన్నింగ్, అలాగే మెదక్ కొత్త బస్టాండ్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు బాలికలకు రెండు కిలోమీటర్ల రన్నింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా…

ఎమ్మెల్యే రాకముందే లక్కీ డ్రా.. అధికారుల తీరుపై దానం నాగేందర్ ఆగ్రహం

ప్రతిపక్షం, ఆగస్టు 29: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యక్రమానికి హాజరయ్యేలోపే అధికారులు లక్కీ డ్రాను ప్రారంభించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి, తాను వచ్చే వరకు వేచి చూడకుండా డ్రా ప్రారంభించడం ఏమిటంటూ అధికారులను ప్రశ్నించారు.…

రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.9,250 ఆదాయం.. పోస్టాఫీస్ పథకంలో ఐదేళ్ల పాటు స్థిర రాబడి!

ప్రతిపక్షం, ఆగస్టు 29: మార్కెట్‌లో పెట్టుబడులపై వచ్చే లాభనష్టాలతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలని భావించే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఉపయోగకరమైన ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా పదవీ విరమణ పొందినవారు, నెలవారీ ఖర్చులకు క్రమం తప్పకుండా కొంత ఆదాయం అవసరమయ్యే కుటుంబాలకు ఈ పథకం ద్వారా నిర్ణీత మొత్తాన్ని ఒకేసారి జమ చేసి ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ…

సెప్టెంబరులోగా 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగన్వాడీ పోస్టులను సెప్టెంబరు నెలలోగా భర్తీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జిల్లా స్థాయిలోనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ…

ఘోరం.. శ్రావణంలో మటన్ కర్రీ వండమన్నాడని కొడుకును కొట్టిచంపిన తండ్రి

ప్రతిపక్షం, ఆగస్టు 28: శ్రావణ మాసంలో మటన్ కర్రీ వండాలని పట్టుబట్టిన కొడుకును తండ్రి తీవ్రంగా కొట్టి చంపిన విషాద ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. కుటుంబంలో మతపరమైన ఆచారాలు, మద్యం మత్తు కారణంగా తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఘర్షణ చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే ప్రాంతానికి చెందిన మహేశ్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి…

నల్ల బంగారానికే పరిమితమైన సింగరేణి.. ఇక అసలు బంగారం వెలికితీతలోకి అడుగు!

ప్రతిపక్షం, ఆగస్టు 28: తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ మరో కీలక రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు బొగ్గు, అంటే నల్ల బంగారం వెలికితీతకే ప్రధానంగా పరిమితమైన సింగరేణి.. ఇకపై అసలు బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ, వెలికితీత పనుల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ బ్లాక్‌లో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

ప్రధాన రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ సమస్యకు చెక్‌.. ఐఐటీ-హైదరాబాద్‌తో దక్షిణ మధ్య రైల్వే కీలక ఒప్పందం

ప్రతిపక్షం, ఆగస్టు 28: సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపట్టింది. ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంతో పాటు స్టేషన్ పరిసరాల్లో రాకపోకలు మరింత సులభతరం చేయడానికి ఐఐటీ-హైదరాబాద్‌ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ డివిజన్,…

డ్రైవర్‌ ఖాతా ద్వారా కూతురు ఖాతాకు లంచాలు.. మైనింగ్‌ అధికారి అక్రమాస్తుల గుట్టు రట్టు చేసిన ఏసీబీ

ప్రతిపక్షం, ఆగస్టు 28: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ గనుల శాఖ అధికారి బి. జయరాజుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో గురువారం జయరాజుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చర ఆస్తులతో…

వాట్సాప్‌ గ్రూపులో చేర్చి.. భారీ లాభాల ఆశ చూపి రూ.2.31 కోట్లు కాజేశారు

ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు పొందవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ వైద్యుడిని నమ్మించి ఏకంగా రూ.2.31 కోట్లు కాజేసిన ఘటన సైబరాబాద్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ పీరం చెరువు ప్రాంతానికి చెందిన డాక్టర్‌ శ్రీనివాస్‌ ఈ మోసానికి బాధితుడయ్యారు. నకిలీ పెట్టుబడి పథకం, అనధికారిక వ్యాపార అనువర్తనం ద్వారా నిందితులు ఆయనను మోసం చేసినట్లు పోలీసులు…

రాఖీ అంటే మణికట్టుకు కట్టే దారం కాదు.. మనసులను కలిపే ప్రేమ బంధం

*రాఖీ అంటే మణికట్టుకు కట్టే దారం కాదు…మనసులను కలిపే ప్రేమ బంధం.”*జీవితంలో ఏన్నో బంధాలు వస్తుంటాయి…కానీ తోడబుట్టినా బంధం గొప్పది .*అన్నాచెల్లెళ్ల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.”*రాఖీ దారం చిన్నదే అయినా, జీవితాంతం నిలిచే ప్రేమను,నమ్మకాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది .*మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి . ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 28: రాఖీ పండుగ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు…

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం.. రేవంత్‌ పాలనపై ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, ఆగస్టు 28: తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ కనిపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల

ప్రతిపక్షం, ఆగస్టు 28: రాష్ట్రంలో యూరియా సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ, యూరియా సరఫరా, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ,…

జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల గైర్హాజరు.. మంత్రి దామోదర్ ఆగ్రహం

ప్రతిపక్షం, ఆగస్టు 28: జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు గైర్హాజరు కావడం, ప్రైవేటు వైద్యుడితో చికిత్స అందించడంపై వచ్చిన వార్తలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత, విధుల్లో వైద్యుల గైర్హాజరు వంటి అంశాలపై సమగ్ర…

లవర్ కోసం పేపర్ లీక్.. బ్రేకప్ తర్వాత వెలుగులోకి

ప్రతిపక్షం, ఆగస్టు 27: మహారాష్ట్రలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారంలో భాగంగా ఓ యువకుడు అధికారులతో కుమ్మక్కై ప్రశ్నపత్రాన్ని సంపాదించడం, ఆ తర్వాత అదే ప్రేమికురాలు తనకు దూరం కావడంతో ఆగ్రలవర్ కోసం పేపర్ లీక్.. బ్రేకప్ తర్వాత వెలుగులోకిహానికి గురై పేపర్ లీక్ విషయాన్ని బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై…

కృతి సనన్ డ్రెస్‌పై కంగన విమర్శలు.. పాత ఫొటోలతో నెటిజన్ల కౌంటర్

ప్రతిపక్షం, ఆగస్టు 27: రాఖీ పండుగ సందర్భంగా కృతి సనన్ నటించిన ఓ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై నటి, ఎంపీ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి. కృతి సనన్ దుస్తుల విషయంలో కంగన అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజాగా నెటిజన్లు ఆమె గతంలో ధరించిన దుస్తులకు సంబంధించిన ఫొటోలను వెలుగులోకి తీసుకొచ్చారు. 2015లో జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న సమయంలో కంగన రనౌత్ ధరించిన దుస్తులకు…

కేసీఆర్ ఆరోగ్యంపై హరీశ్ రావు క్షుద్రపూజలు చేయించేవారు: కవిత సంచలన ఆరోపణలు

ప్రతిపక్షం, ఆగస్టు 27: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుపై ఆ పార్టీ నేత కవిత సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యం బాగుండకూడదనే ఉద్దేశంతో హరీశ్‌రావు క్షుద్రపూజలు చేయించేవారని ఆమె ఆరోపించారు. హరీశ్‌రావుకు గతం నుంచే ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉందని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి, భవిష్యత్తు గురించి పలువురు…

ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్.. ఎమ్మెల్యే ఇంట్లో రాఖీ సంబరాలు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 27: “రాఖీ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల బంధానికి గుర్తు మాత్రమే కాదు.. ఆప్యాయత, విశ్వాసం, పరస్పర సహకారానికి ప్రతీక. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, యువతకు అండగా నిలుస్తున్న డా. మైనంపల్లి రోహిత్ రావు కు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతి రాజు తెలిపారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హైదరాబాద్ లోని ఇంట్లో మెదక్ మున్సిపల్…

రెండు మిల్లులపై అధికారుల కొరడా

•నిబంధనలు ఉల్లంఘించినరెండు రైస్ మిల్లులపై చర్యలు…!! •రూ.17.25 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు.. వనపర్తి ప్రతినిధి, ఆగస్ట్ 27(ప్రతిపక్షం ): నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని రెండు రైస్ మిల్లుల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తకోట మండలంలో సాయిబాబా రైస్ మిల్,…

రక్షాబంధన్

ప్రతిపక్షం,రామగుండం (ప్రతినిధి), ఆగస్టు 27: దాక్షాయణి వరబలమునరక్షాబంధన్ రచించు రమణీమణులున్రాక్షస బెడదయులేకనురక్షింప బడెదరుగాక రాజ్యమునందున్. రాకుమార. గోదావరిఖని,పెద్దపల్లి జిల్లా 9550184758 . . The post రక్షాబంధన్ appeared first on Prathi Paksham .

సన్న వరి రైతులకు రూ.500 బోనస్.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి

సన్న వడ్లకు రూ.500 బోనస్.. రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి 7 రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్.. సెప్టెంబర్ 10 లోగా నమోదు చేసుకోవాలి. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి . చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ . ప్రతి పక్షం చండూరు , ఆగస్టు 27: చండూరు మండలంలోని రైతాంగానికి తెలియజేయునది ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన 7 సన్న […] The…

చండూరు మున్సిపాలిటీలో వార్డు సభ – హాజరై దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ శ్రీదేవి

ముసాయిదా ఓటర్ల జాబితా, SIR ప్రక్రియపై చండూరు లో కీలక సమావేశం ముసాయిదా ఓటర్ల జాబితా, SIR పై- BLO, BLA లకు ఆర్డీవో శ్రీదేవి దిశానిర్దేశం. పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి . చండూరు రెవెన్యూ డివిజన్ అధికారి వందనపు శ్రీదేవి . ప్రతి పక్షం చండూర్, ఆగస్టు 27: చండూరు మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ మరియు SIR (Special Intensive Revision) కి సంబంధించిన…

తుమ్మిడిహట్టి బ్యారేజీపై కదలిక.. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక భేటీ

ప్రతిపక్షం, ఆగస్టు 27: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నిరంతరంగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో జరుపుతున్న సంప్రదింపుల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న న్యూఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో…

మునుగోడు నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా బొమ్మరబోయిన కవిత

*అపాయింట్ లెటర్ అందజేసిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి. ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 27: మునుగోడు నియోజకవర్గ వార్డ్ మెంబర్ల ఫోరం ఇన్చార్జిగా కస్తాల గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు బొమ్మరబోయిన కవితా సైదులు ఎంపికయ్యారు. గురువారం ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోత అపాయింట్ లెటర్ అందజేశారు.ఈ సందర్భంగా కవిత తన ఎన్నిక పట్ల స్పందిస్తూ ప్రతినిత్యం గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వార్డ్…

అయ్యప్ప భక్తుడిగా డేవిడ్ వార్నర్.. ‘ఇరుముడి’ పోస్టర్ వైరల్

ప్రతిపక్షం, ఆగస్టు 25: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాలోని అయ్యప్ప భక్తుడి పోస్టర్‌ను ఆధారంగా చేసుకుని వార్నర్‌ను అదే తరహాలో చూపిస్తూ అభిమానులు ఈ పోస్టర్‌ను రూపొందించారు. పోస్టర్‌లో డేవిడ్ వార్నర్ అయ్యప్ప భక్తుడి వేషధారణలో ఇరుముడితో కనిపించేలా చిత్రీకరించారు. ఈ ఫ్యాన్ మేడ్…

ఫ్రీగా కుట్టు మెషీన్లు.. అప్లై చేసుకున్నారా?

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణలో బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50…

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పతక విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

ప్రతిపక్షం, ఆగస్టు 25: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చినందుకు వారిని ప్రశంసించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ…

జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు గ్రహీత సంధ్యకు ఘన సన్మానం

*చొప్పరి వారి గూడెం పాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్తమ కార్యదర్శి జి.సంధ్యకు సత్కారం *చొప్పరి వారి గూడెం పంచాయతీ కార్యదర్శికి జిల్లా స్థాయి గుర్తింపు – పాలకవర్గం అభినందన. ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 25: జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు అందుకున్న జి. సంధ్య గారిని చొప్పరి వారి గూడెం గ్రామ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. చండూరు మండలంలోని చొప్పరి వారి గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు…

పిల్లలకు వచ్చే ఎమోజీల పట్ల జాగ్రత్త: పోలీసులు

ప్రతిపక్షం, ఆగస్టు 25: సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఉపయోగించే ఎమోజీల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు సాధారణంగా కనిపించే కొన్ని ఎమోజీలను సంకేతాలుగా ఉపయోగిస్తూ పిల్లలతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల…

కూలబడిన తండ్రి.. హృదయ విషాదం

ప్రతిపక్షం, ఆగస్టు 25: మగబిడ్డ పుట్టాడన్న ఆనందంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ తండ్రికి ఊహించని విషాదం ఎదురైంది. తన బిడ్డను తొలిసారి చూసి మురిసిపోవాలని ఆస్పత్రికి చేరుకున్న ఆయనకు.. బిడ్డ ముఖం చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడన్న వార్త గుండెలు పగిలేలా చేసింది. మహారాష్ట్రలోని అమరావతి ఆస్పత్రిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ బోర్గేకు మగబిడ్డ పుట్టాడన్న…

2034 కాదు.. 2029లోనే జమిలి ఎన్నికలు? జేపీసీ కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 25: దేశంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. జమిలి ఎన్నికలపై కమిటీ సంప్రదించిన వర్గాల్లో 99 శాతం మంది మద్దతు తెలిపినట్లు జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి వెల్లడించారు. దీంతో 2034 వరకు వేచి చూడకుండా 2029లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. వన్…

డీ-మార్ట్‌లో సరకులు కొంటున్నారా?

ప్రతిపక్షం, ఆగస్టు 25: డీమార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు బిల్లింగ్ సమయంలో ధరలను ఒకసారి పరిశీలించుకోవాలన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. డిస్‌ప్లేలో చూపించిన ధర కంటే బిల్లింగ్ సమయంలో ఎక్కువ మొత్తం వసూలు చేశారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ డీమార్ట్‌లో షాపింగ్ చేసిన సమయంలో ఈ ఘటన…

పార్టీ నాయకురాలి కూతురు కాబట్టే సైలెంట్‌గా ఉన్నాం: జగ్గారెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యల వ్యవహారం మరింత రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీకి చెందిన నాయకురాలి కుమార్తె కావడంతోనే తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలు…

విదేశీ వర్సిటీల మాటలు వద్దు.. ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి: బండి సంజయ్

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణలోని విద్యార్థులు, కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ముందుగా రాష్ట్రంలోని కళాశాలలను, విద్యార్థులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా దాదాపు రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు…