RSS Amplifier

News source

naandi news

Latest News

naandinews.comSource feed ↗36 articles

Live Last read · last published · next check

Written by

Latest articles

గనులపై ఘనంగా రాఖీ వేడుకలు

సింగరేణిలో గనులపై రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిలే బీ షిఫ్ట్ ఇన్‌చార్జి జయంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా.. కార్మికులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరూ సోదరభావంతో, ఐకమత్యంతో మెలగాలని జయంత్ కుమార్ ఆకాంక్షించారు. రాఖీ పండుగ స్ఫూర్తితో పరస్పరం ఆత్మీయతను పెంపొందించుకోవాలని అన్నారు.…

అన్నా… రాఖీ క‌డ‌తా…

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు తనకు కొంత సమయం కేటాయించాలని ఆమె కోరారు. ఇటీవల ఆమె చుట్టూ ముసిరిన వివాదం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా భేటీ కానుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. వివాదం సద్దుమణిగిన తర్వాత జరుగుతున్న…

పాఠశాలలో పొలిటికల్‌ షో.. విద్యార్థులతో కవాతు!

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పాఠశాల అది.. ఓ రాజ‌కీయ నాయ‌కుడి మెప్పు కోసం విద్యార్థుల‌తో క‌వాతు చేయించారు.. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాల్సిన అధికారులు, ఉపాధ్యాయులు వారితో ఎందుకు స్వాగ‌తం ప‌లికించారు. ఈ కవాతుకు అనుమతి ఇచ్చింది ఎవరు? నిబంధనలు ఉల్లంఘించారా..? మీడియా వ‌స్తే స‌వాల‌క్ష‌ నిబంధనలు.. రాజకీయ నేతలకు ఘ‌న స్వాగ‌తాలు… ఈ మిన‌హాయింపులు దేని కోసం…? ఎవ‌రి మెప్పు కోసం……

మ‌ద్యం షాపులో చోరీ : సీసీ కెమెరాలో రికార్డు

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ లిక్కర్‌ మార్ట్‌ను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. మార్ట్‌లోకి చొరబడిన దుండగులు మద్యం బాటిళ్లతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. కాగజ్ నగర్ పట్టణంలోని త్రినేత్రి వైన్స్ దుకాణంలో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణం యజమాని ఉదయం…

ఇనుప‌రాడ్లే ప్రాణాలు తీశాయి… రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి

Kodada Bus Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బస్సులో 42 మంది…

బద్దిపోచమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు

వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. గ్రామ దేవత, శీతల దేవత అయిన బద్దిపోచమ్మ అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో బోనం మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావ‌ణ మంగళవారం పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి బెల్లం బోనాలు, శాకంబరి నైవేద్యాలు (పట్నాలు), ఒడిబియ్యం సమర్పించి, పట్టుచీరలు, సారెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివసత్తుల…

142 సెల్‌ఫోన్లు అందించిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 142 సెల్‌ఫోన్లను (సుమారు రూ. 27.40 లక్షల విలువ) సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు రికవరీ చేశాయి. మంగళవారం ఏర్పాటు చేసిన ‘సెల్‌ఫోన్ రికవరీ మేళా’లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వీటిని బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా 10,420 ఫిర్యాదులు రాగా, 3,717 ఫోన్లను రికవరీ చేసి యజమానులకు…

వేములవాడలో భక్తుల రద్దీ : 87 వేల మందికి పైగా దర్శనం

ప‌విత్ర శ్రావ‌ణ సోమ‌వారం కావ‌డంతో వేములవాడ‌కు భ‌క్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు, అభిషేకాలు, ఆకు పూజలు, చండీ హోమం, నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమ పూజలు వంటి వివిధ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంద‌ర్భంగా సుమారు 87,540 మంది భ‌క్తులు…

బొగ్గు నుంచి బంగారం దాకా.. సింగరేణికి కొత్త దిశ..

‎తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ లాంటి అత్యుత్త‌మ ప్ర‌భుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా లాభదాయ‌క సంస్థ‌గా అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్‌లు సాధించ‌డంలో సంపూర్ణ స‌హ‌కారం అందిస్తున్న భ‌ట్టి విక్ర‌మార్కను సింగ‌రేణిలోని గుర్తింపు, ప్రాతినిథ్య‌, అధికార సంఘాల నాయ‌కులు స‌చివాల‌యంలో ఘ‌నంగా స‌న్మానించారు. ‎ ‎​ ఈ…

నిర్మ‌ల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఇద్ద‌రు అరెస్టు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యాపారి పన్ను మొత్తాన్ని తగ్గించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పన్ను తగ్గించేందుకు డీసీటీవో గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధిత వ్యాపారి ఏసీబీ అధికారులను సంప్రదించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి…

విద్యార్థుల‌తో పెట్టుకున్న ఏ ప్ర‌భుత్వం బాగుప‌డ‌లేదు

పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల క‌లెక్ట‌రేట్ ఎదుట పాల్‌టెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధ‌ర్నాలో పాల్గొని మాట్లాడారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ఛిన్నాభిన్నం అవుతుంద‌న్నారు. గతంలో పాలిటెక్నిక్…

బ్యాంకుల దేశ‌వ్యాప్త స‌మ్మె

త‌మ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక దేశ‌వ్యాప్త స‌మ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు మ‌రికొన్ని డిమాండ్లను ప్ర‌భుత్వం ముందుంచారు. ఆదివారం జ‌రిగిన స‌మావేశంలో యూనియ‌న్ నేత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు రోజుల ప‌నిదినాల డిమాండ్‌ నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్ 11న…

చదువులు చెప్పేవారే లేరు.. గోడ‌ దూకిన విద్యార్థులు!

బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు ఆందోళనకు దారితీశాయి. సరైన స్థాయిలో విద్యాబోధన అందించే సిబ్బంది లేకపోవడంతో చదువులు దెబ్బతింటున్నాయని విద్యార్థులు చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సోమ‌వారం ఉద‌యం 2.30 ప్రాంతంలో సుమారు 35 మంది విద్యార్థులు గోడ దూకి పాఠశాల…

రెచ్చిపోతున్న దొంగ‌లు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) మండల కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండు చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ మాజీ జెడ్పీటీసీ (ZPTC) ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారం, నగదును అపహరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా రెండు రోజుల్లో రెండు చోరీలు జరగడంతో…

ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు భారీ స్పందన

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నిర్వహించనున్న 60 రోజుల ఉచిత కోచింగ్ కు సంబంధించి అర్హత పరీక్షకు 3,446 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా కొన‌సాగింది. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ దాదాపు 300 మందిని ఎంపిక చేసి ఉచిత…

మ‌హిళ హ‌త్య‌,,, మృత‌దేహంతో బిర్యాని

“ఒక మనిషిని చంపడం.. ఆపై శరీర భాగాలను సూట్‌కేసులో కుక్కి రైల్లో తరలించడం.. ఇదంతా వింటేనే గుండె జల్లుమంటుంది కదూ? కానీ, అంతకంటే అత్యంత ఘోరమైన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది! హత్య చేసిన ఆ మృతదేహ భాగాలతోనే ఏకంగా బిర్యానీ వండారు! వింటేనే రోమాలు నిక్కబొడుచుకునే ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు”.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహిళను అత్యంత క్రూరంగా…

సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై సమరశంఖం

Singareni:సింగ‌రేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై పక్షపాత వైఖరితో ఛార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, కంపల్సరీ రిటైర్మెంట్లు వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్(SC/ST Welfare Association) ప్రతినిధులు ఆరోపించారు. విజిలెన్స్ విచారణల సమయంలో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ, ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు,…

క‌లెక్ట‌రేట్ ను ఇడియ‌ట్స్ న‌డిపిస్తున్న‌రు…

క‌లెక్ట‌రేట్‌ను ఇడియ‌ట్స్ న‌డిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం 22A నిషేధిత భూములపై బీజేపీ నాయ‌కులు క‌లెక్ట‌రేట్ వెళ్లారు. క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అందించేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారు లోప‌లికి వెళ్ల‌కుండా పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో మండిప‌డ్డారు. క‌లెక్ట‌ర్‌ను మూర్ఖుల గుంపు న‌డిపిస్తోందంటూ దుయ్య‌బ‌ట్టారు. క‌లెక్ట‌ర్ కు…

ఎమ్మెల్యే ఫొటో మిస్సింగ్‌… ఆందోళ‌న‌

సొంత నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు అవమానం జరిగిందంటూ ఆయ‌న వ‌ర్గం ఆందోళ‌న‌కు దిగారు. దీంతో అధికారులు ఏకంగా ఆ ఫ్లెక్సీ తొల‌గించాల్సి వ‌చ్చింది. ఉట్నూర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ఉట్నూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఏకరూప దుస్తులు, కిట్ల పంపిణీ కార్యక్రమం కోసం ఐటీడీఏ అధికారులు ఫ్లెక్సీ…

ప్ర‌జ‌ల‌కు స‌త‌ర్వ న్యాయం అందాలి

“ప్రతి ఒక్కరినీ గౌరవిద్దాం… సంతోషంగా జీవిద్దాం” అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక న‌గేష్ పిలుపునిచ్చారు. మందమర్రిలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం నూతన భవనం, బెల్లంప‌ల్లిలో సీనియ‌ర్ సివిల్ కోర్టు భ‌వ‌నాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, అహంకారం, చిన్నచిన్న విషయాలే అనేక గొడవలకు…

నేను ఓడిపోతా: మంత్రి గడ్డం వివేక్

రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగుతుందనే గ్యారెంటీ తనకు లేదంటూ మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో స్కిల్ యూనివర్సిటీ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లరని ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వగలదా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా మంత్రి వివేక్ ఆసక్తికరంగా స్పందించారు. ”రేపు నేను ఓడిపోతా.. మా గవర్నమెంట్ పోతది. నా గ్యారెంటీతో మీకేం…

అయ్యో కాక… గిట్లాయే ఏంది..?

కాకా వెంకటస్వామి…. నీ పేరు వింటే చాలు, పేదోళ్ల పెన్నిధిగా గుర్తుకొస్తవు… నిన్ను కాక వెంకటస్వామి కంటే కూడా గుడిసెల వెంకటస్వామి గానే నిన్ను గుర్తుంచుకుంటం… 80 వేల మందికి కులం, తలం అని లేకుండా ఆశ్రయం కల్పించిన నిన్ను ఎలా మరిచిపోతం.. కార్మికులకు అండగా నిలబడి పార్లమెంట్లో మా గురించి మాట్లాడిన నిన్ను గుండెల్లో పెంటుకున్నం కదా…? నువ్వు ఎంత మందికి రాజకీయ ఆశ్రయం కల్పించావు… నీ చేత ఎంత మందికి టిక్కెట్లు…

మంచిర్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగాయపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. లంచం మొత్తాన్ని స్వాధీనం…

కూరగాయలు రోడ్డు పై పోసి నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రామ్ మందిరం ఎదుట కూరగాయల విక్రయాలపై వివాదం కొనసాగుతోంది. రామ్ మందిరం ఎదురుగా కూరగాయలు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు. కూరగాయల విక్రయాల కోసం మున్సిపల్ అధికారులు కేటాయించిన స్థలంలో వ్యాపారం చేయడం తమకు సాధ్యం కాదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రామ్ మందిరం వద్దే కూరగాయలు…

కూరగాయలు రోడ్డు పై పోసి ఆందోళన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని రామ్ మందిరం ఎదుట కూరగాయల విక్రయాలపై వివాదం కొనసాగుతోంది. రామ్ మందిరం ఎదురుగా కూరగాయలు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు, కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు. కూరగాయల విక్రయాల కోసం మున్సిపల్ అధికారులు కేటాయించిన స్థలంలో వ్యాపారం చేయడం తమకు సాధ్యం కాదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రామ్ మందిరం వద్దే కూరగాయలు…

ఒక అడుగు ముందే ఉండాలి..

నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండాలని, నూత‌న టెక్నాలజీతో నేరాలపై ‘నిఘా’ పెంచాల‌ని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా(Kaleshwaram Zone DIG Amber Kishore Jha) స్ప‌ష్టం చేశారు. ఆయ‌న భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నేరాల నియంత్ర‌ణ‌కు టెక్నాలజీనే స‌రైన ఆయుధమ‌న్నారు. సీసీటీవీ వ్యవస్థ…

విధులు నిర్వ‌హిస్తుండ‌గా గుండెపోటు… సింగరేణి కార్మికుడు మృతి

భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న ఓ సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న గోపి అనే సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కేటీకే-1 ఇంక్లైన్లో కోల్ కట్టర్ గా పనిచేస్తున్న గోపాల గోపి (39) రాత్రి షిఫ్ట్ లో 28 డీప్, 14 లెవెల్లో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో తోటి…

‘‘కాక’’ రేపిన‌.. విగ్ర‌హావిష్క‌ర‌ణ

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ కాక మరోసారి రగిలింది. కొన్నేళ్లుగా కవర్‌లో ఉన్న కాకా గడ్డం వెంకటస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు వ్యతిరేక వర్గం అకస్మాత్తుగా ఆవిష్కరించడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలతో నివాళులర్పించిన ఈ కార్యక్రమం.. సాధారణ ఆవిష్కరణనా? లేక రాజకీయ బలప్రదర్శనా? అన్న ప్రశ్నలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి రేపుతున్నాయి. కాకా…

బెల్లంపల్లి లో రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణించాడు. బోయపల్లి నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎండమూరి సురేష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను శాంతిఖని లో విధులు నిర్వహిస్తున్నాడు. మరొక కార్మికుడు కన్నాల బస్తికి చెందిన గట్టు చిరంజీవికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సమాచారం…

ఉమ్మడి ఆదిలాబాద్‌లో పెద్దపులుల కలకలం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. అటు కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌.. ఇటు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అర్లీ టి శివారులో అడవి పంది పులి దాడిలో మృతి చెందడం, పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లోకి వెళ్లేందుకు సైతం జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల…

బూతుల నేతకు షాక్

ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉట్నూర్‌లో ఇటీవల జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. సమావేశంలో సీనియర్ నేత సంజీవరెడ్డిని ఉద్దేశించి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. అనుచిత పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ…

రేఖానాయ‌క్‌పై కేసు నమోదు

ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పై ధాన్యం ఎగవేత పై కేసు నమోదు అయింది.. తన పేరిట ఉన్న రైస్ మిల్లులో రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కుంభ కోణంలో ఆమె పై ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెన్‌పల్లిలోని ఓ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటన బయటపడింది. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో […]

ఖానాపూర్‌లో భారీ ధాన్యం కుంభకోణం..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెన్‌పల్లిలోని ఓ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటన బయటపడింది. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడంతో.. దాని విలువను సుమారు రూ.40.96 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సత్తెన్‌పల్లిలోని *M/s ARS Industries (మిల్ కోడ్ 175825)కు రబీ 2022-23, 2023-24,…

యువతకు ఉద్యోగాలే లక్ష్యం..

యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో ఎంపికై రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని మంత్రి గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరులో ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న యువతకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో…

హ‌రీష్‌రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ఆస్పత్రి వ్యవహారం రాజకీయంగా వేడి రగిలించింది. టిమ్స్ ఆస్పత్రి సందర్శించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Former Minister Harish Rao)ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయ‌నతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను సైతం పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. ఈ…

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం

Singareni:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్ హామీల అమలు కోసం INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని క‌లిసింది. ఈ సంద‌ర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను ఆయ‌న‌కు వివరించింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై భ‌ట్టితో నేత‌లు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా , సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల…