చిన్నప్పటి నుండి ఇతరులతో, ముఖ్యంగా కొత్తవాళ్ళతో, కలవడం అలవాటైన వాళ్ళకి ఎక్కడైనా ఇమడటం పెద్ద కష్టం కాదు. కానీ అందరికీ అలా ఉండదుగా. నా మాట కొస్తే, 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు జిల్లా సరిహద్దులు దాటలేదు. అప్పటి వరకు రైలు ప్రయాణం కూడా ఎరగను. చెప్పులు వేసుకోవడం అలవాటు కాకపోవడం వల్ల, ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పులు కొన్నా, వారం తిరక్కుండా వాటిని ఎక్కడో పారేసుకుంటూ ఉండడం వల్ల, అటు చేసి ఇటు చేసి 14 ఏళ్ళ ……
కథలలో లిష్టులు (lists) ఏమిటి, ట్విష్టులు (twists) కదా ఉండాల్సింది అని అనుకుంటున్నారా. అదే గమ్మత్తు. అయితే ఈ గమ్మత్తు చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు లిష్టులు అంటే వాటిల్లో ఏముండాలి? మనం చెప్పే కథకి వాటికి లింకు (link) ఏమిటి? ఈ ప్రశ్న లన్నిటికీ మన సాహిత్యంలో దొరికే కొన్ని సమాధానాలు చూద్దాం. అసలు మన ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ఒక లిష్టుతోనే మొదలవుతుంది. వాల్మీకి మహర్షి నారదుడికి 16 గుణాల…
“మాలిక” అంటే మాల, వరుస, దొంతర, పరంపర, సరణి – ఇత్యాది అర్థాలు ఉన్నాయి. సంగీతంలో రాగమాలిక అన్న ప్రక్రియ ఉంది. వివిధ రాగాలను వరుసగా మార్చుకుంటూ ఒకే పాట లేదా కృతి లోని చరణాలను పాడటం దీని లోని ప్రత్యేకత. ఒక రాగంలో పాడుతూనే, పాట లోని వివిధ భాగాలకు వేర్వేరు తాళాలను మార్చి పాడే పద్ధతిని తాళమాలిక అంటారు. “పద్యమాలిక” అంటే పద్యాల వరుస అని సామాన్యమైన అర్థము. తెలుగు ఛందస్సులో “పద్యమాలిక” అంటూ … Continue…
నేను రచించిన “కు(సు)మతీ శతకము” అన్న పుస్తకం 17-06-2026న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia600807.us.archive.org/10/items/kusumati-shatakamu-free-e-book/Kusumati%20shatakamu%20free%20e-book.pdf
తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యతమనకి తెలుగులో గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి (అంటే, గజడదబాదేశ సంధి) అన్న రెండు హల్ సంధులున్నాయి. రెండవ పదంలో ఉన్న కచటతపలకి ఈ రెంటిలో ఏవి ఆదేశాలవుతాయో చూడంగానే అర్థమవుతుంది. గసడదవాదేశ సంధిలో మొదటి పదం ప్రథమా విభక్తి (డు, ము, వు, లు) అయి ఉంటే, సరళాదేశ సంధిలో మొదటి పదం ద్రుత ప్రకృతికం (చివర ‘న్’ లేదా ‘న’ ఉండేది) అయి ఉంటుంది. ఈ వ్యాకరణం పరమానందయ్య లాంటి … Continue reading…
01 – 09 – 2025న ప్రచురించిన “సమస్యాపూరణాల సమాహారం” అన్న నా పుస్తకంలో(Free E-Book), 456 సమస్యలకి నేను చేసిన 620 పూరణలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత పూరించిన సమస్యలు పుస్తక రూపంలో ఒక్కసారిగా ప్రచురించే ముందు ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఈ భాగంలో 10 సమస్యలకి పూరణలు ఇవ్వబడ్డాయి. 1. సమస్య: బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్ కం. చెలు లన యతడే దారిని శిల … Continue reading…
[Link to this Book was shared by E-Mail to the Hon’ble Prime Minister, the Hon’ble Minister of Statistics and the Hon’ble Minister of Law in the Union Government, the Cabinet Secretariat, the Secretary (Legislative Department), the Secretary & a few Senior Officers of the Ministry of Statistics and Programme Implementation, and the State / UT … Continue reading Free E-Book on the Collection of…
వన్ అప్ ఎఫిషియన్సీ (one-up efficiency) అంటే ఎప్పటి కప్పుడు ఇతరుల కన్నా తాను కాస్త మెరుగు అని అనిపించుకోవడం, పనికొచ్చే పనిలోయైనా సరే పనికిరాని పనిలోయైనా సరే. మా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని నవ్వించడానికి చెప్పిన ఒక కథ దీన్ని చాలా బాగా వివరిస్తుంది అని నాకు పెద్దయిన తరువాత తెలిసింది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి అందరి సమక్షంలో పట్టాభిషిక్తుడవుతాడు. అందరి సమక్షంలో…
చాలా కాలం క్రితం శ్రీశ్రీ గారు సినిమాల గురించి ఎక్కడో ఒక ఇంటర్వ్యూ (interview) లో అన్న మాటలు నాకు ముందుగా గుర్తు చేసుకోవాలని ఉంది. “…. అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకి పరిపాటి అయ్యింది. ఇది ఎంత అసందర్భంగా వున్నదో చెబుతా వినండి. ప్రతివాడూ తిండి కోసం హోటలుకి వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకి వెళ్ళక తప్పదు. ……
కొంత మంది తిట్టినా ఎవ్వరికీ కోపం రాదు. వాళ్ళ పెద్దరికం అలాంటిది. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871 – 1927) గారు. వీరు ఇంచుమించు తమ సమవయస్కులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు ఆ రోజుల్లో నాటకాలు వేసే వారట. పంతులు గారు గుండ్రటి ముఖం కలవారు కాబట్టి నాయిక దమయంతి గాను, నారాయణరావు గారు నాయకుడు నలుడు గాను వేషం కట్టేవారట. ఆ విషయం పక్కన పెడితే, నారాయణరావు గారు … Continue…